దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో వైరస్ మెదడులోకి ప్రవేశించి శ్వాస వ్యవస్థలోకి సోకుతోందని తేలింది. కోల్ కతా శాస్త్రవేత్తలు వైరస్ ముక్కుద్వారా మెదడులోని ఓల్ ఫ్యాక్టరీ బల్బ్ లోకి.... అక్కడినుంచి ప్రిజాట్ జింగర్ కాంప్లెక్స్(పీబీసీ) లోకి ప్రవేశించిందని చెబుతున్నారు. ఈ వ్యవస్థ శ్వాసను నియంత్రిస్తోందని... వైరస్ వల్ల మెదడులోని శ్వాస వ్యవస్థ పని చేయకపోవడంతో మనుషులు చనిపోతున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
మృతి చెందిన వారి మెదడును పరిశీలిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మరోవైపు దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 13,000కు పైగా కేసులు దేశంలో నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: