కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వలస కార్మికుల కోసం మరో కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చింది. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పేరుతో ప్రభుత్వం వలస కార్మికులకు ఉపాధి కల్పించనుంది. నేడు రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు ఈ పథకం ద్వారా ఉపశమనం పొందుతారని కేంద్రం భావిస్తోంది. 
 
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 116 జిల్లాలకు చెందిన వలస కార్మికులు స్వరాష్ట్రాలకు తిరిగి రావడంతో 125 రోజుల్లో ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్‘ పథకం కింద వలస కార్మికులకు 25 ప్రాజెక్టు పనుల్లో ఉపాధి కల్పన చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా వలస కార్మికులు ఈ పథకంలో చేరాలని కేంద్రం చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: