ఇప్పుడు కరోనా దెబ్బకు ముంబై నగరం అల్లాడిపోతుంది. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడ మృతదేహాలకు కరోనా పరిక్షలు వద్దు అని నిర్ణయం తీసుకుంది అక్కడి సర్కార్. దానికి కారణం ఏంటీ అంటే కరోనా పరిక్షల పేరుతో అంత్యక్రియలు ఆలస్యం చేస్తున్నామని దీని వలన కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

దీనితో స్పందించిన సర్కార్ మరణించిన వారితో కాంటాక్ట్ ఉన్న వారికే కరోనా పరిక్షలు చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మృతుల కాంటాక్ట్స్‌ ఆధారంగా కరోనా ఫలితాలను కనుక్కుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్‌ వ్యాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉంటూ మరణించి, కరోనా లక్షణాలు ఉన్న వారి మృతదేహాలకు మాత్రమే పరీక్షలు చేస్తామని ఆయన స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: