ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా అడుగు పెట్ట‌ని రంగం అంటూ లేదు. ఇప్ప‌టికే ఒక్కో రంగం క‌రోనా దెబ్బ‌తో విల‌విల్లాడుతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు క‌రోనా ఫార్మా రంగానికి కూడా విస్త‌రించింది. చా‌లా మంది యువ‌త ఇటీవ‌ల ఫార్మా రంగాన్ని ఎంచుకుంటున్నారు. సాధార‌ణ డిగ్రీలు చ‌దివిన వారు ఉన్న‌త ఉద్యోగం దొర‌క‌క ముందుగా ఫార్మా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏపీ, తెలంగాణాల్లో లక్షల మంది ఈ ఫార్మాల్లో పనిచేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రంగంలో పెద్ద‌గా క‌రోనా కేసులు న‌మోదు కాలేదు. ఇప్పుడు క‌రోనా ఈ రంగాన్ని కూడా ట‌చ్ చేసింది.

 

తాజాగా ఫార్మా కంపెనీల్లో క‌రోనా కేసులు ప‌దుల సంఖ్య‌లో న‌మోదు అవుతున్నాయి. ఇక్క‌డ ప‌ని చేసే వారు ఎక్కువ సంఖ్య‌లో ఉంటారు. ఏ చిన్న జాగ్ర‌త్త లేక‌పోయినా ఈ క‌రోనా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి పాకుతుంది.  సంగారెడ్డి జిల్లా బొల్లారం ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలోని ఓ ఫార్మా కంపెనీలో ప‌ని చేస్తున్న ఆరుగురు కార్మికులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఫార్మా ఇండ‌స్ట్రీకి సంబంధించి మొద‌టి కేసులు ఇవే. 

 

హైద‌రాబాద్‌తో పాటు ఏపీలోని వైజాగ్, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఒకే కంపెనీలో ఏకంగా ఆరుగురికి క‌రోనా పాజిటివ్ సోక‌డంతో అంద‌రూ షాక్ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వీరు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: