కరోనా తీవ్రత నేపధ్యంలో తెలంగాణా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసులు అన్నీ కూడా 50 శాతం ఉద్యోగులతోనే నిర్వహించాలి అని నిర్ణయం తీసుకుంది. డ్యూటి లేని ఉద్యోగులు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళవద్దు అని సూచనలు చేసింది. ఈ నెల 22 నుంచి జూన్ నాలుగు వరకు కూడా ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి. 

 

ఒక వారం 50 శాతం ఉద్యోగులు మరో వారం 50 శాతం ఉద్యోగులతో కార్యాకలాపాలను నిర్వహించాలి అని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఏసీలు వాడకుండా ఉంటే మంచిది అని సూచనలు చేసింది. అనారోగ్య సమస్యలు ఉన్న వారు వయసు పైబడుతున్న వారు అందరూ కూడా లీవ్ లు వాడుకోవాలి అని సూచనలు చేసింది. అధికారుల డ్రైవర్ లు పార్కింగ్ వద్ద కాకుండా పేషీలోనే ఉండాలి అని సూచనలు చేసింది సర్కార్. లిఫ్ట్ లో కూడా ముగ్గురే వెళ్ళాలి అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: