తమిళనాడు రాష్ట్రంలో కరోనా తగ్గుతుందని ఆ రాష్ట్ర సిఎం పళని స్వామి పేర్కొన్నారు. తమిళనాడులో 54 శాతం కరోనా రికవరీ రేటు ఉందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో 83 కోవిడ్ పరీక్షా కేంద్రాలు, 17,500 పడకలు అందుబాటులో ఉన్నాయని  ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే విధంగా మరి కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఈ కొత్తరకం వ్యాధికి ఇంకా ఎలాంటి మందూ రాలేదన్నారు ఆయన.

 

ఎలా వ్యాపిస్తుందో మనకు తెలియదని చెప్పుకొచ్చారు. కోవిడ్ బారిన పడిన వారికి చికిత్స అందించి, కోలుకునేలా చర్యలు మాత్రమే మనం తీసుకోగలమని అన్నారు. మెడికల్ క్యాంపుల సంఖ్యను 450కి పెంచేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఈ సందర్భంగా వివరించారు. వైరస్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకు గానూ ప్రజలు కోవిడ్-19 మార్గదర్శకాలను సక్రమంగా పాటించాలని ఆయన సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: