లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం స్వల్ప వేతనాలు, సేవా రుసుముల మీద బతికేవారిని ఎందుకు పట్టించుకోవడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎస్సీ కార్పోరేషన్ ఫెసిలిటేటర్లను ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ తరఫున క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు నియమితులైన ఫెసిలిటేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడటం సరికాదు అంటూ ఆయన మండిపడ్డారు. 

 

కార్పొరేషన్ అందించే రుణాలు లబ్ధిదారులకు సకమ్రంగా చేర్చడంలో అవసరమైన పనులు చేసే అనుసంధానకర్తలుగా ఈ ఫెసిలిటేటర్లను ఉన్నారని ఆయన వ్యాఖ్యలు చేసారు. 2017 నుంచి వీరికి వేతనాలు, సేవా రుసుములు చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. 2019 డిసెంబర్ నాటికి 24 నెలల బకాయిలు రావాల్సి ఉందన్న ఆయన... ఆ ఫెసిలిటేటర్ల ప్రతినిధులు జనసేన దృష్టికి తీసుకువచ్చినట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: