ఫాదర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా తమ నాన్నలకు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. తమను గొప్పగా తీర్చిదిద్దిన తండ్రికి ఫాదర్స్ డే రోజున సోషల్ మీడియా వేదికగా ఫోటోలు వీడియో లతో విష్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సోషల్ మీడియాలో తన తండ్రికి విష్ చేసారు. 

 

అదే విధంగా తన పిల్లలు తన భర్త తో ఉన్న ఫోటోలు కూడా ఆమె షేర్ చేసారు. “పిల్లల కళ్లలో సంబరాన్ని చూసి మురిసిపోయే కర్మయోగి నాన్న. జీవితంలో మనల్ని ముందుకు నడిపించి.. తాను మాత్రం వెనక నుంచి చేయూతనివ్వడమే ఏ తండ్రికైనా సంతోషం. నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు.” అంటూ రోజా ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: