ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. గత మూడు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు ఒక్క రాష్ట్రానికి చెందిన వారిలోనే బయటపడ్డాయి. పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యే స్థాయి నుంచి ఏపీలో వందలలో నమోదు అయ్యే స్థాయికి రాష్ట్రం వెళ్ళింది అనేది అర్ధమవుతుంది. ఇక మరణాలు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. 

 

మొన్నటి వరకు ఒకరు ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు రోజు కనీసం 5 మంది మరణిస్తున్నారు. మూడు రోజుల్లో 1200 కేసుల వరకు నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో పలు నగరాల్లో అనధికారిక లాక్ డౌన్ అనేది అమలు చేస్తున్నారు. విజయవాడ కర్నూలు సహా కడప అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఈ లాక్ డౌన్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: