కరోనా ప్రభలుతున్న వేళ ఉత్తరప్రదేశ్ లో ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో ప్రభుత్వం నడుపుతున్న ఒక ఆశ్రమ గృహంలో 57 మంది మైనర్ బాలికలకు కరోనా రాగా వారిలో ఐదుగురు అమ్మాయిలూ గర్భం తో ఉన్నారని అధికారులు గుర్తించారు. ఇక కరోనా రాని మరో ఇద్దరు కూడా గర్భంతో ఉన్నారట. 

 

వారిలో ముగ్గురిని రామా మెడికల్ కాలేజీలో చేర్పించగా, ఇద్దరిని హాలెట్ ఆసుపత్రికి పంపారు. స్వరూప్ నగర్ వద్ద ఉన్న ఈ ఆశ్రమంలో జిల్లా యంత్రాంగం సీలు చేసి సిబ్బందిని నిర్బంధించారు. దీనిపై సిఎం యోగి ఆదిత్య నాథ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనిపై విచారణకు గానూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: