తెలంగాణ‌లో బీజేపీకి కేసీఆర్ వ‌రుస షాకులు ఇస్తూనే ఉన్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచు కోవ‌డంతో ఇక బీజేపీ త‌మ‌కు తిరుగులేద‌ని బీరాలు పోయింది. అయితే ఆ త‌ర్వాత జ‌రిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ బీజేపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఇక హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి 3 వేల ఓట్లు కూడా రాలేని దుస్థితి. ఇక తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లోనూ చాప‌కింద నీరులా బీజేపీ కేడ‌ర్‌ను తుడిచి పెట్టేస్తున్నారు.

 

ఇందుకు కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఉత్త‌ర తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో బీజేపీ కేడ‌ర్ అనేదే లేకుండా చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలోని మాక్లూర్ మండలం బీజేపీ మండల అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కల్లెడ సర్పంచ్ లావణ్యలు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. వారికి ఆర్మూర్ 
ఎమ్మెల్యే jeevan REDDY' target='_blank' title='జీవన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి  కార్యక్రమాలను చూసే టీఆర్ఎస్ లో చేరినట్లు వారు తెలిపారు. ఈ కొత్త జిల్లాల్లో బీజేపీ ప‌రిస్థితి చూస్తే చాలా చోట్ల ఆ పార్టీని బంద్ చేసుకోవ‌డం ఒక్క‌టే మిగిలి ఉందా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: