ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్,  వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఎక్కువగా అధికారులతో జగన్ సమీక్షించారు. విజయవాడ అనంతపురం ఒంగోలు గుంటూరు, కర్నూలు గురించే ఎక్కువగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాంతాల్లో అధికారులు అనధికారిక లాక్ డౌన్ ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి గల కారణాలను కూడా సిఎం జగన్ కి వివరించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: