ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. చాప కింద నీరులా విజృంభిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 4.25 లక్షల కరోనా కేసులు నమోదు కాగా 14,000 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. తాజాగా ప్రముఖ సంస్థ టైమ్స్ నెట్ వర్క్ అంచనాల్లో దేశంలో జులై నెలలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కానున్నాయని... సెప్టెంబర్ లో వైరస్ అంతరించిపోతుందని తేలింది. 
 
తాజాగా ఈ సంస్థ టైమ్ ఫ్యాక్ట్ ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖల హెల్త్ బులెటిన్లు, కొన్ని గణిత సిద్ధాంతాల ఆధారంగా ఈ సంస్థ వైరస్ వ్యాప్తిని అంచనా వేసింది. భారత్ లో జులై 25 నాటికి 3,86,916 కేసులు నమోదవుతాయని... సెప్టెంబర్ 19వ తేదీ నాటికి కరోనా దాదాపుగా అంతమైపోతుందని ఈ సంస్థ చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: