తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. నిన్న నగరంలో కనిష్టంగా 25 డిగ్రీలు... గరిష్టంగా 31.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. గాలిలో తేమ 59 శాతంగా నమోదైందని సమాచారం. 
 
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: