తెలంగాణ రాష్ట్రంలో నయీం ఎన్ కౌంటర్ తరువాత అతని అక్రమాల గురించి చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే నయీం కేసులో ఇప్పటికీ డైరీ, డబ్బు, భూముల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నయీం చనిపోయి మూడున్నరేళ్లు అయినా ఈ విషయాల గురించి స్పష్టత రాకపోవడంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎంట్రీ ఇచ్చింది. లోక్ పాల్ చట్టం కింద నయీం కేసు గురించి విచారణ జరపాలని డిమాండ్ చేసింది. 
 
ఫోరం ఫర్ గవర్నెన్స్ ఈ కేసులో నాలుగు రాష్ట్రాల పోలీసుల, రాజనీయ నాయకుల ప్రమేయం ఉందని చెబుతోంది. నయీంతో 25 మంది పోలీస్ అధికారులకు లింకులు ఉన్నట్లు గతంలో సిట్ చేసిన విచారణలో తేలింది. ఈ 25 మందిలో 14 మంది ఎస్సైలు ఉన్నారు. సిట్ విచారణలో నయీంకు స్థానిక రాజకీయ నాయకులతో కూడా లింక్ లు ఉన్నట్టు తేలింది. అయితే పలు కీలక విషయాల్లో స్పష్టత లేకపోవడంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లోక్ పాల్ చట్టం కింద విచారణ జరపాలని కోరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: