అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రైవేట్ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. అమెరికా దేశ ట్రాన్స్ పోర్టు డిపార్టుమెంటు ఎయిర్ ఇండియా భారతీయులతో పాటు పబ్లిక్ వ్యక్తులకు కూడా టికెట్లను అక్రమంగా అమ్ముతోందని ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ లో భాగంగా భారతీయులను దేశానికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి విదితమే. 
 
అమెరికా తాజాగా చేసిన ఆరోపణల గురించి భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. మరోవైపు కరోనా విజృంభణ వల్ల కేంద్రం అమెరికన్ ఎయిర్ లైన్స్ భారత్ లోకి రావడంపై నిషేధం విధించింది. అమెరికన్ ట్రాన్స్ పోర్టు డిపార్టు మెంట్ భారత్ నిర్ణయం వల్ల తమ ఎయిర్ లైన్స్ తీవ్రంగా నష్టపోతున్నట్లు ప్రకటన చేసింది. ప్రైవేటు విమానాల రాకపోకలపై 30 రోజుల్లో నిషేధం అమలులోకి వస్తుందని... ప్రైవేటు విమానాలు నడుపుకోవాలనుకుంటే ఇండియా డిపార్టుమెంటు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: