కర్ణాటకలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు లోని వైరస్ ప్రభావిత క్లస్టర్లలో పూర్తిస్థాయి లాక్ డౌన్  విధించింది కర్ణాటక ప్రభుత్వం. 

 

 పెరుగుతున్న కేసులు తనిఖీ చేసేందుకు వీలుగా మొత్తంగా ఐదు కోవిడ్ క్లస్టర్లో సంపూర్ణ లాక్ డౌన్  విధించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలక కమిషనర్ అనిల్ కుమార్ వెల్లడించారు. సడలింపులు సమయాన్ని ప్రజలు దుర్వినియోగం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు, బెంగళూరులోని కె.ఆర్ మార్కెట్, కలసిపాళ్య,  సిద్దాపుర, వివి పురం తో పాటు క్లస్టర్ సమీపంలోని ప్రాంతాలను కూడా సంపూర్ణ లాభం విధించి వైరస్ చెకింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: