చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు సీరియస్ గా వ్యవహరిస్తుంది. చిత్తూరు జిల్లా పుంగునూరు, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గాల్లో భారీగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కి స్థానికుల సహకారం తో కొందరు పాల్పడుతున్నారు అని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. 

 

ప్రత్యేక బృందాలుగా విడిపోయి ప్రతీ ఇంటిని సోదాలు చేయగా దాదాపు 500 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇక కొంత మంది అడవుల్లో ఉండే గిరిజనుల ఆధారంగా కూడా ఈ స్మగ్లింగ్ ని నిర్వహిస్తున్నారు అని అధికారులు గుర్తించారు. వారు అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి తుపాకులు పోలీసులకు ఇస్తున్నారు. తమిళనాడు కి చెందిన కొందరు కూలీలు ఈ నియోజకవర్గ గ్రామాల్లో ఉన్నారు అని వర్షా కాలం కావడంతో అడవులు పచ్చబడ్డాయి అని అందుకే భారీగా వస్తున్నారు అని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: