దేశంలో కరోనా వైరస్ ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగే పరిస్థితి అయితే ఏ విధంగా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది.  ప్రతీ లక్ష మందిలో ఒకరు కరోనా కారణంగా మరణిస్తున్నారు అని... ప్రపంచ సగటు 6.04తో పోలిస్తే, భారతదేశంలో లక్ష జనాభాకు ఒకరు మాత్రమే కరోనాతో మరణిస్తున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

 

ప్రపంచం లెక్కల ఆధారంగా చూస్తే ఇది చాలా అత్యల్పంగా ఉందని అన్నారు. కేసులను సకాలంలో గుర్తించడం, విస్తృతమైన కాంటాక్ట్ ట్రేసింగ్, సమర్థవంతమైన క్లినికల్ మేనేజ్‌మెంట్ తో మరణాల రేటు భారీగా తగ్గింది అని కేంద్ర సర్కార్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: