ఒలింపికడేే సందర్భంగా తన నివాసం నుంచే రాష్ట్రంలో ఒలింపిక ఉత్సవాలను ఆయనఈ రోజు  ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క్రీడాకారులు కరోనా మహమ్మారి బారినపడకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ తమ ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని క్రీడా,పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు.  ఈ కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ప్రేమ్‌రాజ్‌, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ లాల్‌బహదూర్‌ స్టేడియంలోని తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌ కార్యాలయం సందర్శించారు.

 

ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే క్రీడా పాలసీ రూపకల్పన పై కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించారని అన్నారు.  ఈ సందర్భంగా ఒలింపికక అసోసియేషన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షులు వేణుగోపాలచారి , మాజీ అధ్యక్షులు రంగారావు, ప్రధాన కార్యదర్శి జగదీశ్‌యాదవ్‌, స్పోర్ట్స్‌ ఛైర్మన్‌ వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: