ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అప్పుడే పుట్టిన చిన్నారులను సైతం కరోనా వదలటం లేదు. మెక్సికోలో అప్పుడే జన్మించిన ముగ్గురు కవలలతో పాటు తల్లికి కరోనా నిర్ధారణ అయింది. పిల్లలకు కరోనా సోకడంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. మెక్సికోలోని శాన్ లూయిస్ పోటోసి రాష్ట్రంలోని ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రిలో చేరి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. 
 
ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మగపిల్లలు కాగా ఒకరు ఆడపిల్ల. పిల్లల్లో శ్వాస సంబంధిత సమస్యలు కనిపించడంతో వైద్యులు పరీక్షించగా కరోనా నిర్ణారణ అయింది. పిల్లలతో పాటు తల్లికి కరోనా సోకిందని.... ఇది చాలా అరుదైన ఘటన అని..... తల్లి గర్భంతో ఉన్న సమయంలోనే పిల్లలకు వైరస్ సోకి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: