దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాలుస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో కేంద్రం కరోనా వల్ల భారత్‌లో ప్రతి లక్ష మందిలో ఒక్కరు మాత్రమే మరణిస్తున్నారని ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందిలో 6.04 మంది మరణిస్తుండగా భారత్ లో సరైన సమయంలో కేసులను గుర్తించి, సమర్థవంతంగా చికిత్స అందించడం వల్లే మరణాల సంఖ్య తక్కువగా ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. 
 
కేంద్ర ఆరోగ్య శాఖ బ్రిటన్‌లో లక్ష మందికి 63.13 మృతులు, స్పెయిన్‌లో 60.60, ఇటలీలో 57.19, అమెరికాలో 36.30, జర్మనీలో 27.32, బ్రెజిల్‌లో 23.68, రష్యాలో 5.62 మంది మరణిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు దేశంలో సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కొత్తగా 14,933 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 4,40,215కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: