భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు ఇప్పుడు భారత్ మీద సైబర్ దాడులకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన ఒక పోలీసు అధికారి సంచలన వ్యాఖ్యలు చేసారు. చైనాకు చెందిన హ్యాకర్లు గత ఐదు రోజులలో భారతదేశ సమాచార సాంకేతిక మౌలిక సదుపాయాలు మరియు బ్యాంకింగ్ రంగంపై 40,000 సైబర్ దాడులకు ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. 

 

తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో సరిహద్దు దాటి ఆన్‌లైన్ దాడులు జరిగాయని మహారాష్ట్ర పోలీసు సైబర్ వింగ్ స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ వివరించారు. ఈ దాడుల్లో ఎక్కువ భాగం చైనాలోని చెంగ్డు ప్రాంతం నుంచి జరిగాయని ఆయన వివరించారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్‌ను హైజాక్ చేయడంతో పాటుగా మరియు ఫిషింగ్ వంటి సమస్యలను కలిగించే లక్ష్యంతో ఈ దాడులు జరిగాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: