అప్పటి వరకు అందరితో కలిసి మాట్లాడారు.. సంతోసంగా ఉన్నారు..  బట్టలు ఉతికేందుకు చెరువుకు వచ్చిన ఐదుగురు బాలికలు ప్రమాదవశాత్తూ అందులో మునిగి మరణించిన విషాద ఘటన మహారాష్ట్రలోని జాల్నా జిల్లా తలేగాంవాడీ గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోకి దిగిన ఐదుగురు చిన్నారులు చెరువు పూడికలో చిక్కుకుపోయారు. అటువైపుగా వెళ్తున్నవారు గమనించి బాలికలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

 

అప్పటికే వారు మరణించారని ఫూలంబ్రీ ప్రాథమిక వైద్యకేంద్రం అధికారులు చెప్పారు. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఐదుగురు బాలికలు మరణించిన ఘటనతో ఆ గ్రామంలో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.   మృతులందరూ ఐదు నుంచి ఏడేళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న పిల్లలను ఇలాంటి ప్రదేశాలకు పంపే సమయంలో ఎవరైనా పెద్దలు ఉండి వారిని చూసుకోవాలని గ్రామస్థులను హెచ్చరించారు పోలీసులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: