దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా సరే చాలా మంది మాస్క్ లు ధరించడానికి ఆసక్తి చూపించడం లేదు. కేసుల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నా సరే జనాల్లో మాత్రం మార్పు అనేది రావడం లేదు. దీనితో ఇక ప్రభుత్వాలు కూడా కాస్త కఠినం గానే వ్యవహరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు పెరుగుతున్నా అక్కడ చాలా మంది ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. 

 

దీనితో బుధవారం ఢిల్లీలో పోలీసులు మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్‌ 188లో భాగంగా మొదటిసారి మాస్కు ధరించకుండా బయట తిరిగితే రూ.500, రెండోసారికి రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు అధికారులు వివరించారు. అక్కడ కరోనా కేసులు 60 వేలకు పైగా నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: