వైసీపీకి చెందిన కొత్త రాజ్య‌స‌భ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఆయ‌న దేశంలోనే అత్య‌ధిక ధ‌న‌వంతుడు అయిన ఎంపీగా రికార్డుల‌కు ఎక్కారు. అయితే అంద‌రూ ఎంపీలు అంటే ఇటీవ‌ల రాజ్య‌స‌భ‌కు ఎంపికైన ఎంపీల్లో మాత్ర‌మే ఆయ‌నకు ఈ రికార్డు ద‌క్కింది. కొత్త‌గా ఎన్నికైన రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ఎక్కువ ఆస్తులు క‌లిగిన ఉన్న ఎంపీల్లో టాప్ 10 లిస్టులో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారే ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో తొలి ఇద్ద‌రూ వైసీపీకి చెందిన వారే కావ‌డం విశేషం.

 

వైసీపీ నుంచి ఎన్నికైన కార్పొరేట్‌ ప్రముఖుడు పరిమల్‌ నత్వాని కంటే కూడా మరో ఎంపీ ఆళ్ల అయోధ్యరామి రెడ్డి ఆస్తులే ఎక్కువగా ఉన్నాయి. రూ. 2577 కోట్ల విలువైన ఆస్తులతో అయోధ్యరామిరెడ్డి తొలి స్థానంలో ఉన్నారు. ఇక రు. 396 కోట్ల‌తో నత్వాని రెండో స్థానంలో ఉన్నారు. ఇక మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత‌, ఇటీవ‌లే బీజేపీలోకి జంప్ చేసిన జ్యోతిరాదిత్య రూ. 379 కోట్ల విలువైన ఆస్తులతో మూడోస్థానంలో ఉన్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్ద‌రు స‌భ్యుల్లో ఒక‌రైన సురేష్ రెడ్డి కూడా టాప్ 10లో ఉన్నారు.108 కోట్ల విలువైన ఆస్తులుతో.. ఆయ‌న‌ 7వ స్థానంలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: