జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు సోమవారం "బ్లాక్ హౌస్ అటానమస్ జోన్" అని ప్రకటించిన నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. “నేను మీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకు వాషింగ్టన్ DC లో 'అటానమస్ జోన్' ఉండదు. వారు ప్రయత్నిస్తే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

ఆయన ట్వీట్లను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. నిరసన కారులను బెదిరిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ మంగళవారం హెచ్చరిక నోటీసు ఇచ్చింది. ఇది ఒక వర్గాన్ని అవమానించే విధంగా ఉంది అని ట్విట్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత ట్రంప్ చేసే పోస్ట్ లపై సామాజిక మాధ్యమాలు నిఘా పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: