ఆంధ్రప్రదేశ్ లో జులై లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. రోజు రోజుకి కేసుల తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ జులై లో కేసుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక తాజాగా సిఎం వైఎస్  జగన్ తో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా అధికారులు కూడా ఇదే విషయం చెప్పినట్టు తెలుస్తుంది. 

 

దీనితో అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కేసులు పెరిగితే ఎం చెయ్యాలి అనే దాని మీద ఇప్పుడు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఇక కేంద్రం సహాయం కూడా అడగాలి అని సిఎం జగన్ భావిస్తున్నారు. ఇక కరోనా పరిక్షల వేగం కూడా పెంచే ఆలోచనలో సిఎం ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: