ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 448 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు. 
 
రెస్టారెంట్లు, తోపుడుబళ్లపై వ్యాపారాలు, షాపింగ్‌ మాల్స్‌, మద్యం దుకాణాలు, అధ్యాత్మిక కేంద్రాలు కూడా 11 గంటల లోపు మూసివేయాలని చెప్పారు. మందుల షాపులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, బ్యాంకులు అత్యవసర సర్వీసుల్లో భాగంగా యథావిధిగా పని చేస్తాయని అన్నారు. విద్యా సంస్థలను తెరవరాదని..... ఆర్డీవో, తహశీల్దారు అనుమతితో ఫంక్షన్‌లను పది మందికి మించకుండా నిర్వహించుకోవచ్చని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: