భారత్ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐ.ఆర్.డీ.ఏ.ఐ) దేశంలో కరోనా కేసులు వెలుగు చూశాక బీమా ఉన్నవారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చింది. అయితే తాజాగా బీమా సదుపాయం లేని వారిని దృష్టిలో ఉంచుకుని ముసాయిదాను సిద్ధం చేసింది. ఐ.ఆర్.డీ.ఏ.ఐ కరోనా కోసం స్వల్ప కాల పరిమితితో బీమా పాలసీలు విక్రయించేందుకు అనుమతులు ఇచ్చింది. 
 
బీమా సంస్థలు 3 నెలల కాలపరిమితి నుంచి 11 నెలల కాలపరిమితికి పాలసీలను విక్రయించవచ్చు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం కరోనాకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా చికిత్స చేయించుకునేందుకు అనుమతులు ఇస్తున్నాయి. దీంతో స్వల్ప కాల బీమా పాలసీలు అవసరం అని భావించి బీమా నియంత్రణ సంస్థ ఈ పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. సామాన్యులు, చిరుద్యోగులకు ఈ బీమా వల్ల ప్రయోజనం కలగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: