తూర్పుగోదావరి జిల్లాను కరోనా వైరస్ గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాని మండలాల్లో కొత్తగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో నిన్న 99 కేసులు నమోదు కాగా నేడు 54 కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కాజులూరు మండలం ఆర్యవటం గ్రామంలో ఒక మహిళ ద్వారా 29 మందికి కరోనా సోకింది. ఇటీవల ఒక గర్భిణి ప్రసవం అనంతరం వైరస్ భారీన పడగా ఈమె ద్వారా 29 మందికి కరోనా సోకింది. 
 
ఆర్యవటంలో సోమవారం 8 మందికి కరోనా నిర్ధారణ కాగా నిన్న 21 మందికి నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో జిల్లాలో రేపటి నుంచి లాక్ డౌన్ అమలు కానుంది. ఈరోజు నమోదైన కేసులతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 760కు చేరింది. వీరిలో 450 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 305 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: