దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలను వేగంగా చెయ్యాలి అని భావిస్తుంది కేంద్రం. ఎంత వేగంగా కరోనా టెస్ట్ లు చేస్తే అంత వేగంగా కరోనా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం గానూ ప్రత్యేకంగా ల్యాబ్  ల సంఖ్యను కూడా కేంద్ర సర్కార్ పెంచుతుంది. ఇక ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజే ఏకంగా  2 లక్షల టెస్ట్ లు చేసారు. 

 

24 గంటల్లో 2 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించడం ఇదే మొదటి సారి. మొత్తం వెయ్యి ల్యాబుల్లో ఈ పరిక్షలు జరుగుతున్నాయి అని కేంద్రం పేర్కొంది. ఇక రాబోయే రోజుల్లో 3 లక్షలలకు పైగా పరిక్షలు చేస్తామని కేంద్ర సర్కార్ చెప్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: