మరోసారి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ వర్సెస్ ఢిల్లీ సర్కార్ గా మారింది. కోవిడ్ పేషెంట్లందరూ క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ సర్కార్ ఆగ్రహంగా ఉంది. దీనిపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. దీనిపై తాను కేంద్ర హోం మంత్రికి లేఖ రాసా అని అన్నారు. వెంటనే ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరినట్టు ఆయన పేర్కొన్నారు.

 

కోవిడ్ పేషెంట్లకు ఐదు రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పదంటూ ఎల్జీ ఇచ్చిన ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోవాలని అమిత్‌షాను కోరుతున్నానని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులతో ఢిల్లీలో గందరగోళానికి తావిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలను మార్చాలంటూ తాను ఎల్జీకి ఇంతకు ముందు లేఖ రాసినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదని అసహనం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: