తెలంగాణ ప్రభుత్వం పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు పురపాలక శాఖా మంత్రి కేటిఆర్. పురపాలక శాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు ఆయన. ముఖ్యంగా నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలను మార్చాలన్న లక్ష్యంతో ముందుకుపోతుందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 

పట్టణాలు పురోగతి సాధించేందుకు ప్రభుత్వంతో పాటు పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సైతం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన వివరించారు. దీర్ఘకాలంలో పట్టణాలన్నింటిని ప్రజలు జీవించేందుకు అనుకూలంగా లివబుల్ మరియు లవబుల్ సిటీలుగా మార్చాలన్న బృహత్తరమైన, దీర్ఘకాలిక లక్ష్యంతో తెలంగాణ పురపాలక శాఖ పని చేస్తున్నదని చెప్పుకొచ్చారు. పట్టణాల్లో ప్రజలకు అవసరం అయిన ప్రాథమిక సౌకర్యలపైన ప్రస్తుతం తమ దృష్టి ఉందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: