తండ్రి చేతిలో అత్యాచారానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు కరోనా సోకింది. బాధితురాలి తల్లికి కూడా వైరస్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం వారు గుంటూరు జీజీహెచ్​లో చికిత్స పొందుతున్నారు.గుంటూరు జిల్లా పెదనందిపాడులో ఈ నెల7న తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన బాలికకు, ఆమె తల్లికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాలిక ఈ నెల 8న గుంటూరు జీజీహెచ్​లోని జనరల్​ మెడిసిన్ విభాగంలో చికిత్స కోసం చేరింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో ఉన్న బాలికకు తల్లి సహాయకురాలిగా ఉంది. కరోనా అనుమానంతో వారికి 3 రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ కరోనా ఉన్నట్లు తేలటంతో ఆస్పత్రిలోని కరోనా వార్డుకు తరలించారు.

 

 

 

అందరి మనసులను కలచి వేసిన ఘటన కన్న కూతురి పైనే తండ్రి అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఓ వ్యక్తి.. తన కన్న కుమార్తెపై ఈనెల 7వ తేదీన మధ్యాహ్నం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఆ విషయం బయటకు చెప్పలేక.. ఆవేదన భరించలేక ఎలుకల మందును కూల్ డ్రింక్ లో కలిపి తాగి బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.

 

 

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బాధితురాలిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని... అతని కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: