దేశంలో కరోనా వైరస్ మనిషికి షాపంగా మారింది.  ఒకటి కాదు రెండు కాదు ప్రపంచ వ్యాప్తంగా కోటికి చేరాయి కేసులు.  ఇక మరణాల సంఖ్య ఐదు లక్షలకు దగ్గర చేరింది.  కరోనా చిన్నా పెద్దా.. పేదా ధనిక అనే తేడాలు లేవు.. అందరినీ చుట్టేస్తుంది.  ఆ మద్య లాక్ డౌన్ సిరియస్ గా చేసినంత కాలం కేసులు నామ మాత్రంగా పెరిగినా.. గత కొంత కాలంగా లాక్ డౌన్ సడలించిన తర్వాత బీభత్సంగా విజృంభిస్తుంది. ఇక ఏపిలో కరోనా కేసులు అంతకంతగా పెరిగిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం  క్వారంటైన్ కేంద్రంలో ఓ మహిళ మృతి చెందింది.

 

గంగానమ్మపేటలో ఈనెల 18న భర్తకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రైమరీ కాంటాక్ట్స్‌గా అతడి భార్య, ఇద్దరు పిల్లలను క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు. అయితే భార్యని క్వారంటైన్ కి తరలించగానే గుండె గుండెపోటుకు గురై క్వారంటైన్ సెంటర్‌లోనే మృతి చెందింది. వెంటనే అధికారులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరోవైపు కరోనా బారిన పడిన భర్త.. ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: