వైసీపీ సర్కార్ సరిగ్గా ఏడాది క్రితం ప్రజావేదికను కూల్చిన సంగతి తెలిసిందే. ఈరోజు టీడీపీ నేతలు ప్రజావేదికను కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించటానికి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు ప్రజా వేదికకు వెళ్లే అన్ని రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు టీడీపీ నేతల వాహనాలను గుర్తించి వాటికి మినహా ఇతర వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. 
 
పోలీసులు కరకట్ట దగ్గరకు వచ్చిన నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతరులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేస్తున్నారని.... చంద్రబాబు నివాసానికి వెళుతుంటే అడ్డుకోవడం దారుణం అంటూ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: