టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్తున్న టిడిపి నేతలందరినీ పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేసి  నేటికి సంవత్సరకాలం పూర్తవుతున్న సందర్భంగా టిడిపి నేతలు అందరూ చంద్రబాబు ఇంటికి బయలుదేరారు. 

 

 ఈ క్రమంలోనే చంద్రబాబు ఇంటికి చేరుకోకుండా టిడిపి నేతలను మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఆదేశాలను ధిక్కరించి ముందుకు వెళితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టిడిపి నేతలు అందరూ తీవ్ర వాగ్వాదం కు దిగారు. చంద్రబాబు ఇంటికి వెళ్లి అన్ని మార్గాల్లో  పోలీసులు మోహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: