తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రంలోని అడవులను స్మగ్లర్లకు అప్పగించారని అన్నారు. తెలంగాణలో ఎవరిదగ్గర డబ్బులు లేకపోయినా రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పారు. నర్సాపూర్ ప్రాంతం మరో ఏడాదిలో నాగార్జున సాగర్ లా అవుతుందని అన్నారు. 
 
తెలంగాణ ఎప్పటికీ ధనిక రాష్ట్రమే అని అన్నారు. తెలంగాణ వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పదని వ్యాఖ్యలు చేశారు. తలచుకుంటే అమెరికా అయ్య కావచ్చని చెపారు. 100కు 100 శాతం తెలంగాణకు మంచి రోజులు ఉన్నాయని తెలిపారు. గట్టిగా మొండిపట్టు పట్టి పని చేయాలని తెలిపారు. కలప స్మగ్లర్లను ఎవరూ కాపాడలేరని వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: