ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  గత రెండు నెలల క్రితం వంద లోపు కేసులు నమోదు అయ్యాయి.. కానీ గత ఇరవై రోజుల నుంచి అంటే లాక్ డౌన్ సడలింపు తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోవడం మొదలయ్యాయి. ఈ మద్య ఏపిలో కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయని వార్తలువ వస్తున్న విషయం తెలిసిందే. మొన్న తెలంగాణలో ఏకంగా ఒక్కరోజే 730 కేసులు నమోదు అయ్యాయి.  ప్రతిరోజూ కేసులు పెరిగిపోతున్నాయి.

 

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 19,085 శాంపిళ్లను పరీక్షించగా మరో 477 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 118 మంది కరోనా నుంచి కోలుకున్నారు.   ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 4,817 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,830 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

మృతుల సంఖ్య మొత్తం 136కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 8,783 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 10,884 కేసులు నమోదయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి: