దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 12 వరకూ రెగ్యులర్ ట్రైన్ సేవలను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ నుంచి కీలక ప్రకటన వెలువడింది. జూలై 1 నుంచి ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారి నగదు రిఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్న 230 ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. 
 
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి రైలు ప్రయాణాలు చేయాలనుకున్న ప్రయాణికులకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పరిమిత సంఖ్యలో దేశీయ విమాన సర్వీసులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం రైళ్లకు అనుమతిస్తే వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: