తిరుపతి నగరంలో సంచలనం రేపిన యువకుడు విజయ్ హత్య కేసులో పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్ స్నేహితుడే ఈ హత్య చేసినట్లు నిర్ధరణకు వచ్చారు. నిందితుల నుంచి కత్తి, స్క్రూ డ్రైవర్లు, 4 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. 12 మంది యువకులు కలిసి అతన్ని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతి తూర్పు సీఐ శివప్రసాద్​రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన విజయ్, సన్నీ స్నేహితులు. 

 

 

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య డబ్బులు, సెల్​ఫోన్లు, బైకుల వ్యవహారంలో విభేదాలు వచ్చాయి. ఈనెల 16న విజయ్ మరో స్నేహితుడి ఇంటి వద్ద పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్తుండగా దారిలో లోకేశ్ అనే యువకుడు సన్నీని కొట్టాడు. ఈ ఘటనలో విజయ్ లోకేశ్​ను సమర్థించాడు. ఈక్రమంలో పగ పెంచుకున్న సన్నీ.. విజయ్​ను చంపాలని నిర్ణయించుకున్నాడు.ఈనెల 18న విజయ్​కు ఫోన్ చేసిన సన్నీ.. తన ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకలకు రావాలని పిలిచాడు. అనంతరం బైక్ మీద ఎక్కించుకుని గోవిందరాజస్వామి సత్రాల వద్దకు విజయ్​ను తీసుకొచ్చారు.

 

విజయ్ పై కత్తి, స్క్రూ డ్రైవర్లతో దాడిచేసి.. హత్య చేశారు.ఈ కేసులో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకర్ని మైనర్​గా గుర్తించారు. 4 బైక్​లు, కత్తి, స్కూడ్రైవర్లు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: