ఇప్పుడు తెలంగాణాలో ఏ  ప్రాంతంలో చూసినా సరే పులులు ఎక్కువగా కనపడుతున్నాయి. రోజు రోజుకి ఎక్కడో ఒక చోట ఇప్పుడు పులుల హడావుడి ఉంటుంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఒక పెద్ద పులి స్థానికులను భయపెడుతుంది. ఆరు మండలాల్లో అది తిరుగుతూ బాగా ఇబ్బంది పెడుతుంది ప్రజలను. 

 

తాజాగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బుచ్చయ్య పల్లి లో పులి జాడలను అధికారులు గుర్తించారు. స్థానికులు పులి తిరుగుతుంది అని సమాచారం ఇవ్వడంతో రంగం లోకి దిగిన అధికారులు దాని జాడలను గుర్తించారు. దీనితో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసారు. రోజు రోజుకి ఆ ప్రాంతంలో పులి అలజడి ఎక్కువగా ఉంది అని జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: