తెలంగాణ‌లో కరోనా వైర‌స్ ఉధృతిపై కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తాజా ప‌రిణామాలు చెపుతున్నాయి. తెలంగాణ‌లో కేసీఆర్ స‌ర్కార్ క‌రోనా వ‌చ్చిన ప్రారంభంలో ఎన్నో క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకుంది. త‌ర్వాత ప్ర‌భుత్వం చేతులు ఎత్తేయ‌డంతో క‌రోనా కేసులు ఉధృతిని ఎవ్వ‌రూ క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారు. స‌గ‌టున ప్ర‌తి నిమిషానికి తెలంగాణ‌లో ఒక క‌రోనా కేసు న‌మోదు అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డం లేద‌ని.. ఏపీలో జ‌రిగిన‌న్ని ప‌రీక్ష‌లు అక్క‌డ కూడా జ‌రిగితే కేసులు వేల‌ల్లోనే న‌మోదు అవుతాయ‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

 

ఈ నేప‌థ్యంలోనే ఇక్క‌డ క‌రోనా క‌ట్ట‌డి కోసం ఎదుర‌వుతున్న అనుభ‌వాల దృష్ట్యా రాష్ట్రానికి ప్ర‌త్యేక కేంద్ర బృందాన్ని పంపుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని బృందం శుక్ర‌వారం హైద‌రాబాద్ చేరుకోని, రాష్ట్ర అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోనుంది. క‌రోనా కేసుల విష‌యంలో జాతీయ స‌గ‌టు క‌న్నా తెలంగాణలోనే కేసులు ఎక్కువుగా ఉన్నాయి. పాజిటివ్ రేటులో జాతీయ స‌గ‌ట‌లు 8 శాతం ఉండ‌గా, తెలంగాణ పాజిటివ్ రేటు 15శాతం వ‌ర‌కు ఉంది. ఇక కేంద్ర బృందం తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌డం ఇది ఇప్ప‌టికే మూడోసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: