ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట బీమా బకాయిలను విడుదల చేసింది. 2018-19 రబీ కి సంబంధించి 596.36 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేసింది ఏపీ సర్కార్. దీని ద్వారా 5 లక్షల 94 వేల మందికి పైగా రైతులకు లబ్ది చేకూరనుంది. 2019-20 కి సంబంధించి రైతులు అందరికి వైఎస్సార్ పంట బీమా పథకం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

 

ఈ సందర్భంగా సిఎం వైఎస్ జగన్ నేరుగా లబ్ది దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తున్నామని అన్నారు. ఈ క్రాప్ నమోదు అయిన వెంటనే బీమా సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: