గత ప్రభుత్వ తీరుతో రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు అని సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. వైఎస్సార్ పంటల బీమా  పథకం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.  గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టింది అని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం 2018-19 బకాయిలు చెల్లించలేదు అని ఆయన ఆరోపించారు. 

 

చంద్రబాబు సర్కార్ ఎగ్గొట్టిన 122 కోట్లను కూడా తాము రైతులకు చెల్లిస్తున్నామని సిఎం జగన్ అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రైతులకు ఉచితంగా బీమా అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ క్రాప్ నమోదు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రైతు వేసిన ధరకు కనీస మద్దతు ధర చెల్లిస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: