పార్లమెంట్ సమావేశాల ఆనంతరం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ని సస్పెండ్ చేసే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఆయన విషయంలో సిఎం వైఎస్ జగన్ ఆగ్రహంగా ఉన్నారు అని ఆయనను సస్పెండ్ చేయడమే మంచిది అనే భావన లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా పార్టీ నిబంధ‌న‌లు అతిక్ర‌మించార‌ని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని జారీ చేసిన షోకాజ్ నోటీస్‌పై సైతం ఆయ‌న వ్య‌తిరేకంగా స్పందించారు. దీంతో ర‌ఘు విష‌యంలో జ‌గ‌న్ కోసం మ‌రింత‌గా క‌ట్ట‌లు తెంచుకుంటోంద‌ట‌.

 

ఆయనను సస్పెండ్ చేసే విషయమై ఇప్పటికే పార్టీ అగ్ర నేతలతో సిఎం చర్చించారు అని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల ముందు అనవసరంగా రచ్చ ఎందుకు అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆయన కదలికల మీద, ఆయనతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల మీద వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాగా నేడు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. హోం శాఖ కార్యదర్శిని ఆయన కలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: