దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించారు.  రెండు నెలలు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అత్యవసర పనులు నిమిత్తం తప్ప ఎవరినీ బయటకు రానివ్వలేదు.. రవాణా వ్యవస్థ మొత్తం స్థంభింపజేశారు. ఆ సమయంలో కేసులు పదుల సంఖ్యలో నమోదు అయ్యాయి.  కానీ గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ సడలించడంతో కేసులు మరింత పెరుతుగూ పోతున్నాయి. ఏపిలో ఇప్పటికే పదివేల కేసులు దాటాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 605 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

 

వారిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 34 మంది కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన 570 లోకల్ కేసులే. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కి చేరింది. తాజాగా, 191 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు 5,196 మంది కోలుకున్నట్టయింది. మరో 6,147 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 10 మంది మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఏపీలో కరోనా మృతుల సంఖ్య 146కి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: