భారత దేశ సినీ చరిత్రలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆవిష్కరింపబడ్డాయి. అందులో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 రెండు చోటు దక్కించుకున్నాయి.  మునుపెన్నడూ లేని విధంగా జాతీయ చిత్రంగా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచింది.  ప్రపంచ స్థాయిలో బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు రికార్డుల మోత మోగించాయి. ఇప్పుుడు దేశ వ్యాప్తంగా కరోనా భయంతో ప్రజలు వణికి పోతున్నారు.  మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిన విషయం తెలిసిందే.    ముఖ్యంగా మాస్కు ఓ కవచంలా కరోనా వైరస్ సోకకుండా కాపాడుతుందని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.

 

ఈ విషయాన్ని రెండు గ్రాఫిక్స్ సంస్థలు వినూత్నంగా ప్రచారం చేయదలిచాయి. మాహిష్మతి సామ్రాజ్యంలోనూ మాస్కులు తప్పనిసరి అని, మీరు కూడా మాస్కులు ధరించడం మర్చిపోవద్దని ఆ గ్రాఫిక్స్ వీడియోలో పేర్కొన్నారు. బాహుబలి చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న బాహుబలి, భల్లాలదేవుడు ఫైటింగ్ సీన్లో మాస్కులు ధరించి పోరాడుతున్నట్టుగా గ్రాఫిక్స్ చేశారు. ఈ వీడియో ప్రయత్నాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో అభినందించారు. అవిటూన్ ఇండియా, కొల్లాజ్ యునైటెడ్ సాఫ్ట్ వీఎఫ్ఎక్స్ టీమ్ లు మంచి ప్రయత్నం చేశాయని మెచ్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: