ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ టెండరింగ్ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపణలు చేసారు. 2019 నాటికి పూర్తి చేయాల్సిన పోలవరం పనులు ఎందుకు పడకేశాయి? అని నిలదీశారు. 

 

2019లో ఉత్తమ జాతీయ ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకున్న పోలవరం ప్రాజెక్ట్‌ 2020లో ఎందుకు పేరు తెచ్చుకొలేకపోయింది? అని మండిపడ్డారు. మీ అవీనితి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి.. ప్రాజెక్టుల విషయాలను గోప్యంగా ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 22 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేదని, గోదావరి- పెన్నా అనుసంధానం పనులు ఎందుకు ఆపేశారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: